English | Telugu
బుర్రిపాలెంలో మహేష్ బాబు భార్య, పిల్లలు
Updated : Mar 17, 2016
శ్రీమంతుడు సినిమా మహేష్ కు ప్రొఫెషనల్ గానే కాక పర్సనల్ గా కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ సినిమా చూసి చాలా మంది సెలబ్రిటీలు ఊరిని దత్తత తీసుకోవడానికి ముందుకు రావడమే అందుక్కారణం. తను కూడా గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంను అభివృద్ధి చేసి, నాన్నకు ప్రేమతో కానుక ఇద్దామనుకున్నాడు మహేష్. కానీ ప్రకటించి ఏడాదైనా, షూటింగ్స్ బిజీతో ఒక్కసారి కూడా బుర్రిపాలెం వైపు చూడటానికి మహేష్ కు వీలు చిక్కలేదు. దీంతో మహేష్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు కూడా. అయితే మహేష్ వాళ్ల నోళ్లు మూయించాలని ఫిక్సైనట్టున్నాడు. తాజాగా తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో పాటు సోదరి గల్లా పద్మను బుర్రిపాలెం గ్రామానికి పంపాడు.
అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. ఊరంతా తిరిగి చూసి, అభివృద్ధి కోసం ఏమేం చేయాలో అన్నీ నోట్ చేసుకోమని నమ్రతకు మహేష్ సూచించాడట. సూపర్ స్టార్ కృష్ణకు బుర్రిపాలెం అంటే చాలా అభిమానం. ఆయన హీరోగా బుర్రిపాలెం బుల్లోడు అనే సినిమా కూడా వచ్చింది. తను పీక్ లో ఉన్నప్పుడు కృష్ణ ఊరికి బాగానే సాయం చేశారు. ఆ తర్వాత ఆయన ఫేడవుట్ అయిపోవడం, ఊరికి దూరంగా ఉండటం జరిగింది. లేటెస్ట్ గా ఆయన తనయుడు ఊరిని బాగుచేసే పని తీసుకోవడంతో, ఊరు అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆనందిస్తున్నారు బుర్రిపాలెం ప్రజలు.