English | Telugu
పవన్ కళ్యాణ్ ఒక జోకర్, ఒక కార్టూన్ అన్న కమల్
Updated : Mar 17, 2016
బాలీవుడ్ లో కమాల్ ఆర్ ఖాన్ అని పుల్కా కమెడియన్ ఉన్నాడు. సినిమాలకు క్రిటిక్ అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు. మనోడి అసలు పేరు ఎవరికీ తెలియదు. షారుఖ్ ఖాన్ ను ఎస్.ఆర్.కే అంటారు బాలీవుడ్లో. అందుకే తన పేరు కే.ఆర్.కే అని పెట్టుకున్నాడు. అక్కడ జనరల్ గా కే.ఆర్.కే గారిని తిట్టనివారు చాలా అరుదుగానే ఉంటారని చెప్పుకోవాలి. మనోడి పైత్యం అలాంటిది మరి. 2008లో దేశద్రోహి అని ఒక లఫూట్ సినిమా తీసి విమర్శల పాలైన కే.ఆర్.కె ఆ తర్వాత బిగ్ బాస్ లో కూడా తోటి కంటెస్టెంట్స్ పై దాడి చేసి మంచి చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జనాలు ఇతని పైత్యాన్ని భరించలేక కొట్టే స్టేజ్ కు వచ్చే టైంలో సైడ్ అయిపోయి ట్విట్టర్, యూట్యూబ్ లను ఆయుధాలుగా చేసుకున్నాడు. పెద్ద రివ్యూయర్ గా మారాడు(అని అనుకుంటాడు).
రజనీకాంత్ కొచ్చాడయాన్ సినిమా రిలీజ్ కాకముందే తిట్టినా, ధనుష్ హిందీ సినిమా రాన్ జానా రిలీజ్ కు ముందు ధనుష్ పై కాంట్రవర్సీ విమర్శలు చేసినా సదరు కే.ఆర్.కే గారికే చెల్లింది. ఈ ఖాన్ గారికి కావాల్సింది పబ్లిసిటీ. రీసెంట్ గా అలియా భట్ చేసిన ఒక బికిన్ షూట్ ఫొటోపై అభ్యంతరకర కామెంట్స్ చేసి, మరోసారి బాలీవుడ్ కోపానికి గురయ్యాడు ఈ ప్రబుద్ధుడు. ఒకానొక టైంలో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వద్దకు వెళ్లి, కమాల్ ఖాన్ ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. అదీ ఈ కమాల్.ఆర్.ఖాన్ గారి చరిత్ర. ఈయన తాజాగా పవన్ కళ్యాణ్ మీద పిచ్చి కామెంట్స్ చేశాడు.
అసలు ఇలాంటి జోకర్, కార్టూన్ లాంటి హీరో కంటే రాజ్ పాల్ యాదవ్ (కమెడియన్) సినిమాలు చూడటానికి ప్రిఫర్ చేస్తాను. సౌత్ ఇండియన్ పీపుల్ కు ఏమైంది. ఇలాంటి కార్టూన్ ను సినిమాల్లో హీరోగా ఎలా చూస్తారు..? వెరీ బ్యాడ్ ఛాయిస్. ఇతనే హీరో అంటే, ప్రపంచంలో ఎవరైనా హీరో అయిపోవచ్చు. ఇవీ కే.ఆర్.కే ట్వీట్స్.
పబ్లిసిటీ కోసం కొంతమంది ఎంతకైనా దిగజారతారేమో అనిపిస్తుంది పాపం ఇలాంటి వాళ్లను చూస్తే. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ కే.ఆర్.కే గారికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వబోతున్నారో చూడాలి..!