English | Telugu
అఖిల్ రిసెప్షన్.. మహేష్ టీ-షర్ట్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్..!
Updated : Jun 9, 2025
టాలీవుడ్ స్టార్స్ లో అందగాడు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మహేష్ బాబు (Mahesh Babu). ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ మహేష్ తన లుక్స్ తో ఆకట్టుకుంటారు. తాజాగా జరిగిన అఖిల్ అక్కినేని రిసెప్షన్ వేడుకలో మహేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అఖిల్, జునైబ్ ల వివాహం జూన్ 6న జరగగా.. రిసెప్షన్ జూన్ 8న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. (Akhil Zainab reception)
ఇలాంటి వేడుకలకు హరైనప్పుడు తాము ధరించే దుస్తులతో ప్రత్యేకంగా కనిపించాలని అందరూ భావిస్తారు. కానీ, మహేష్ బాబు మాత్రం సింపుల్ గా టీ-షర్ట్ తో వచ్చి.. అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు.
టీ-షర్ట్ లో మహేష్ లుక్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అభిమానులైతే అలాంటి టీ-షర్ట్ కోసం ఆన్ లైన్ లో వేట కూడా మొదలుపెట్టారు. తీరా దాని ధర రూ.1.5 లక్షలు అని తెలిసి షాక్ అవుతున్నారు.
మొత్తానికి అఖిల్ రిసెప్షన్ కి సింపుల్ గా టీ-షర్ట్ లో వచ్చి మొదట సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్.. ఆ తర్వాత దాని ధరతో మైండ్ బ్లాక్ చేశాడని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సినిమాల విషయానికొస్తే, మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు.