English | Telugu

మహేష్ సినిమాకు బ్రేక్

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర యూనిట్.. ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది. 10రోజుల పాటు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత బ్యాంకాక్ లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మరి త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.