English | Telugu
రెండు భాగాలుగా మహేష్, మణిరత్నం సినిమా
Updated : Mar 28, 2011
ఈ చిత్రానికి మొత్తం రెండు వందల కోట్ల అత్యంత భారీ బడ్జెట్ ఖర్చుచేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తూండగా, మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడే రెండవ భాగం మొదలవుతుందట. ఈ చిత్రం మొదటి భాగానికి వంద కోట్లు, రెండవ భాగానికి వంద కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారట. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రానికి గాను మహేష్ బాబు పన్నెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.