English | Telugu
పాన్ తెలుగు ఫిల్మ్.. లావణ్య త్రిపాఠి బర్త్ డే సర్ప్రైజ్ మాములుగా లేదుగా!
Updated : Dec 15, 2021
'మత్తు వదలరా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా రితేష్ రానా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఆయన దర్శకత్వంలో ఇటీవల ఓ మూవీ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. క్లాప్ ఎంటర్టైన్ మెంట్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని మేకర్స్ రివీల్ చేశారు.
నేడు(డిసెంబర్ 15) లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని రివీల్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే లావణ్య త్రిపాఠి' అంటూ విషెస్ తెలిపిన మూవీ టీమ్.. మూవీ టైటిల్ కూడా 'హ్యాపీ బర్త్ డే' అని పెట్టడం విశేషం. టైటిల్ కి తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. మోడ్రన్ డ్రెస్ లో ఉన్న లావణ్య చేతిలో పెద్ద గన్ను పట్టుకొని షూట్ చేస్తూ కనిపించింది. అలాగే పోస్టర్ లో 'నో గన్.. నో ఎంట్రీ' అనే బోర్డు ఉంది. పోస్టర్ లో పార్టీ(సెలబ్రేషన్) మూడ్ కనిపిస్తోంది.
ఈమధ్య పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పోస్టర్ లో పాన్ ఇండియా ఫిల్మ్ అని రాసి ఉండటంతో పాటు.. ఆ సినిమా ఎన్ని భాషల్లో విడుదలవుతుందో అన్ని భాషల పేర్లు పోస్టర్ లో దర్శనమిస్తుంటాయి. అదే తరహాలో 'హ్యాపీ బర్త్ డే' మూవీ పోస్టర్ క్రియేటివ్ గా డిజైన్ చేశారు. పోస్టర్ పైన 'పాన్ తెలుగు ఫిల్మ్' అని రాశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా విడుదల అవుతుందన్న ఉద్దేశంతో ఇలా రాసారో లేక దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ తెలుగులోనే విడుదల అవుతుందన్న ఉద్దేశంతో రాసారో తెలియాల్సి ఉంది. అంతేకాదు పోస్టర్ కింద 'తెలుగు' నే విభిన్న భాషల్లో రాశారు. మొత్తానికి పోస్టర్ ని చాలా కలర్ ఫుల్ గా, క్రియేటివ్ గా డిజైన్ చేశారు. మరి సినిమా కూడా ఇంతే విభిన్నంగా ఉంటుందేమో చూడాలి.
