English | Telugu

'పుష్ప' కోసం శేషాచ‌లం ఎర్ర‌చంద‌నాన్ని మారేడుమిల్లి అడ‌వుల్లో సృష్టించింది ఈ జంటే!

అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించిన 'పుష్ప' మూవీని డైరెక్ట‌ర్ సుకుమార్‌ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందించాడు. క‌థ చిత్తూరు జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రుగుతుంది. కానీ షూటింగ్ జ‌రిపింది మాత్రం రాజ‌మండ్రి స‌మీపంలోని మారేడుమిల్లి అడ‌వుల్లో! నిజానికి మారేడుమిల్లిలో ఎర్ర‌చంద‌నం ఆన‌వాలు అస‌లు లేదు. అయినా అక్క‌డ ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను సృష్టించి, అక్క‌డ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అక్క‌డ ఎర్ర‌చంద‌నాన్నీ, ఆ చెట్ల‌నూ సృష్టించ‌డం వెనుక ఉన్న‌ది.. భార్యాభ‌ర్త‌లైన క‌ళాద‌ర్శ‌క ద్వ‌యం రామ‌కృష్ణ‌-మోనిక‌.

"ఎర్ర‌చంద‌నం దుంగ‌లు రెండు లారీల‌కు స‌రిప‌డేవి చేస్తే చాల‌నుకున్నాం. కానీ 50 లారీల దుంగ‌లు కావాల‌ని సుకుమార్ చెప్పారు. అంటే ప‌ది వేల నుంచి యాభై వేల దుంగ‌లు కావాలి. ఏదీ చిన్న స్కేల్‌లో లేదు. లారీలు కూడా అంతే.. యాభై నుంచి వంద లారీలు క‌నిపిస్తుంటాయి. మారేడుమిల్లికి వెళ్లాలంటే మేం బ‌స చేసిన హోట‌ల్ నుంచి రెండున్న‌ర గంట‌ల స‌మ‌యం పట్టేది. అలాగే అక్క‌డ్నుంచి హోట‌ల్‌కు రావాల‌న్నా అంతే. పైగా షూటింగ్ లొకేష‌న్ ఎక్క‌డో కొండ‌పైన ఉంటుంది. కేవ‌లం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఒక్క‌టే కాదు, ప్ర‌తి డిపార్ట్‌మెంట్ కూడా అక్క‌డ‌కు వెళ్లాల్సిందే. కెమెరా డిపార్ట్‌మెంట్‌ ఎక్విప్‌మెంట్ మొత్తం అక్క‌డ‌కు మోసుకుపోవాలి. యూనిట్ మెంబ‌ర్స్ 500 నుంచి 1500 మంది దాకా ఉంటారు. వీళ్లంద‌రికీ అక్క‌డే ఫుడ్ అరేంజ్ చెయ్యాలి. ఫ‌స్ట్ డే షూటింగ్‌లోనే 1500 మంది ఉన్నారు." అని చెప్పుకొచ్చాడు రామ‌కృష్ణ‌.

Also read:తెలుగు రాష్ట్రాల్లో రూ. 101 కోట్లు.. 'పుష్ప' బిజినెస్ క్రేజ్‌!

అడ‌విలో షూటింగ్ అంటే స‌న్నివేశంలో మామూలుగా అక్క‌డున్న చెట్ల‌ను షూట్ చేస్తారు. కానీ 'పుష్ప' కోసం మారేడుమిల్లిలో చిత్రీక‌రించిన ప్ర‌తి షాట్‌లో క‌నిపించే చెట్ల‌లో ఎక్కువ‌భాగం రామ‌కృష్ణ‌-మోనిక సృష్టించ‌న‌వే. "లొకేష‌న్‌లో రెక్కీ చేయ‌డానికే మేం మ‌ట్టిరోడ్ల‌ను వేసుకోవాల్సి వ‌చ్చింది. అంటే అక్క‌డ‌కు వెళ్ల‌డానికి రోడ్డు కూడా లేదు. మైత్రి మూవీ మేక‌ర్స్ కాబ‌ట్టి ఇంత ఖ‌ర్చుపెట్టి ఈ సినిమాని తియ్య‌గ‌లిగారు. ట్రైల‌ర్‌లో జిగ్ జాగ్‌గా ఉన్న రోడ్డుగుండా అనేక లారీలు వెళ్తున్న దృశ్యం చూశాం. ఆ షాట్ తియ్య‌డానికి వెనుక ఉన్న క‌ష్టం అంతా ఇంతా కాదు." అని రామ‌కృష్ణ తెలిపాడు.

Also read:కొర‌టాల బాట‌లో సుకుమార్ కూడా వెళ‌తాడా?

రామ‌కృష్ణ‌-మోనిక సృష్టించిన ఆర్ట్ వ‌ర్క్ ఎలాంటిదంటే.. హీరో అల్లు అర్జున్ ఒక షాట్ చేయ‌డానికి వ‌చ్చి అక్క‌డ క‌నిపించిన ఒక రాయి మీద కూర్చున్నాడు. అప్పుడు కానీ అది నిజ‌మైన రాయి కాద‌నీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సృష్టించిన న‌కిలీ రాయి అనీ తెలిసింది. "బ‌న్నీ ఆశ్చ‌ర్య‌పోయి, అక్క‌డున్న చాలా రాళ్ల‌ను అలాగే చెక్ చేశారు. నిజ‌మైన రాయి ఏదో, మేం సృష్టించిన రాయి ఏదో తెలియ‌నంత‌గా చాలా బాగా ఆర్ట్ వ‌ర్క్ చేశార‌ని ఆయ‌న మెచ్చుకున్నారు" అని ఆయ‌న చెప్పాడు.

Also read:బ‌న్నీతో ఇంకో వంద సినిమాలు చెయ్యాల‌ని ఉంది!

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా, ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించిన 'పుష్ప' మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతోంది. ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.