English | Telugu
అమ్ముడుపోయిన కొత్తజంట
Updated : Apr 28, 2014
"గౌరవం" వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం "కొత్తజంట". సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ దక్కింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులను మా టీవీ 2కోట్లకు కొనుక్కుంది. మే 1వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జెబి అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. రెజీనా కథానాయిక. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రమలో మధురిమ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్ర కొత్త ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. అల్లు అరవింద్ సమర్పణలో మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.