English | Telugu

చక్రి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాబు, కేసిఆర్

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి బాబు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ బిడ్డ చక్రి అని కేసిఆర్ కొనియాడారు. చిన్న వయస్సులో చక్రి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. జైబోలో తెలంగాణ చిత్రానికి చక్రి సంగీతం అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.