English | Telugu

చక్రి మృతి పట్ల బాలయ్య, చిరు సంతాపం

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం పట్ల హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి సంతాపం తెలిపారు. సంగీత దర్శకుడు చక్రి ,సౌమ్యుడు అంద‌రిని ఆప్యాయం గా ప‌ల‌క‌రించేవాడుని బాలయ్య అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల‌ని అలాగే చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


చక్రి మరణం తీరని లోటు..ఎన్.శంకర్

సంగీత దర్శకుడు చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. ఆయన మారుమూల ప్రాంతం నుంచి స్వయంకృషితో పైకి వచ్చాడని శంకర్ అన్నారు. చక్రి సంగీతంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. తనతో చేసిన 'జై భోలో తెలంగాణ' చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఎంతో ఆదరణ పొందిందని శంకర్ గుర్తు చేసుకున్నారు.