English | Telugu
పీకేకి కమల్ షాకిచ్చాడు
Updated : Feb 12, 2015
బాలీవుడ్ లో వసూళ్లనీ, విమర్శకుల ప్రశంసలనూ కట్టకట్టుకొనివెళ్లిపోయాడు పీకె. ఈ సినిమా రీమేక్ రైట్స్‌కోసం దక్షిణాది నుంచి గట్టిపోటీ ఏర్పడింది. చివరికి జెమిని ఫిల్మ్ సర్య్కుట్ సొంతం చేసుకొంది. కమల్ హాసన్ ఈ రీమేక్‌లో నటిస్తారని వార్తలొచ్చాయి. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ కమల్ హాసనే పీకె అనుకొన్నారు. అయితే... కమల్ మాత్రం పీకే రీమేక్‌కి నో చెప్పాడట. ప్రస్తుతం నా సినిమాలతో నేను బిజీగా ఉన్నాను.. పీకే రీమేక్ కి కాల్షీట్లు కేటాయించే స్థితిలో లేను అని నిర్మాతలకు చెప్పేశాడట. పీకేని రీమేక్ చేయాలని కమల్ భావించాడని, కాకపోతే ఈ విషయంపై బాగా ఆలోచించి, అంత సాహసం చేయకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి కమల్ వచ్చాడని, అందుకే ఈ సినిమాకి నో చెప్పాడని తమిళ వర్గాలు అంటున్నాయి. కమల్‌పై నమ్మకంతో భారీ రేటు వచ్చించి పీకే రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకొన్నజెమిని ఫిల్మ్ సర్క్యుట్ కమల్ నిర్ణయంతో బిత్తరపోతోంది.