English | Telugu

నయనతారకు వరుడు కావలెను

నయనతార ప్రస్తుతం తమిళంలో దాదాపు ఆరు చిత్రాలలో నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్నప్పట్టికి నయనతార ఎక్కడికి వెళ్లినా మీరు ఇలాగే ఉండిపోతారా ? ఇక పెళ్లి చేసుకోరా ? మీ పెళ్లి ఎప్పుడు ? అని అందరూ ఒక్కటే అడుగుతున్నారట. ఈ బాధంతా ఎందుకు ఊరికే పెళ్లి చేసుకుంటే పోలా అనుకుందేమో అమ్మడు తనకు ఓ మంచి సంబంధం చూడమని వాళ్ల అమ్మానాన్నకు చెప్పిందట. ఇప్పటిదాకా తాను చూసుకున్న సంబంధాలు పెళ్లి పీటలు ఎక్కని నేపథ్యంలో ఇక మీరు ఎవరిని చూసినా చేసుకుంటా కాకపోతే సినిమా రంగానికి చెందిన వ్యక్తిని మాత్రం చూడొద్దు అని తల్లిదండ్రులకు తేల్చిచెప్పిందట. ఈ మధ్యనే ఈ విషయం ఇంట్లో చర్చించి పెళ్లికి ఓకె చెప్పిందట. మొత్తానికి నయనతారకు పెళ్లీడు వచ్చిందన్న విషయం ఇప్పటికి గుర్తొచ్చిందన్న మాట.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.