English | Telugu
ఇప్పుడు 'మినపట్టు' వేస్తాడట!
Updated : Feb 12, 2015
ఓర్నాయనో.. 'పెసరెట్టు' మాడి మసై.. బూడిదయ్యింది. ఏదో టైటిల్ బాగుంది కదా అని థియేటర్‌కి వెళ్లి మాడు మొహాలేసుకొచ్చారు ఆడియన్స్. మహేష్‌కత్తి.. కత్తిలా తీస్తాడనుకొన్నవాళ్లు ఆ సుత్తి భరించలేక పారిపోయారు. అయినా మహేష్ కత్తికి తన టాలెంట్‌పై నమ్మకం పోలేదు. పెసరెట్టు పోతే పోయింది.. దానికి సీక్వెల్‌గా 'మినపట్టు' తీస్తా అంటున్నాడట. ఇది పెసరెట్టుకు సీక్వెల్! 'నా సినిమా నచ్చకపోతే మరోటి తీస్తా.. అదీ నచ్చకపోతే ఇంకోటి తీస్తా' అని ఎన్టీఆర్ అన్నట్టు టేస్టు నచ్చేంత వరకూ ఇలాంటి అట్లు వేస్తూనే ఉంటాడేమో ఈయన. మినపట్టూ మాడిపోతే బొబ్బట్లు.. అదీ నచ్చకపోతే దిబ్బరొట్టూ తీస్తాడేమో..???? అన్నట్టు ఈ సినిమా కూడా క్రౌడ్ ఫండిగ్ ద్వారానే చేస్తాడట. మరి ఈయనపై నమ్మకం ఉంచి, డబ్బులు ఇచ్చే మహానుభావులెవరో..???