English | Telugu
గౌతమీ పుత్ర శాతకర్ణితో మిత్రవింద..!
Updated : Apr 17, 2016
నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడంతో దీనిపై డైరెక్టర్ క్రిష్‌తో పాటు బాలయ్య ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే టెక్నిషియన్లు, నటీనటులు అందరి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య రాజుగా నటిస్తుంటే మరి రాజు పక్కన రాణి ఉండాలి కదా..!. బాలయ్య స్టామినాకి తగిన హీరోయిన్ కోసం యూనిట్ గాలిస్తుండగా వీరిలో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సింహా, శ్రీరామరాజ్యం వంటి సినిమాల్లో బాలకృష్ణతో జోడి కట్టిన నయనతార పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా..ఈ జాబితాలోకి కొత్త పేరు వచ్చింది. లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మగధీరలో యువరాణి మిత్రవిందగా స్టార్‌డమ్ కొట్టేసిన కాజల్ శాతకర్ణిలో ఫైనల్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే మగధీర, సర్దార్ గబ్బర్ సింగ్‌లలో యువరాణిగా నటించిన అనుభవం ఉండటంతో ఆ ఎక్స్‌పిరియన్స్ కాజల్‌కి ప్లస్ అయింది. ఈ ప్రపోజల్‌పై తనకు రావడం పట్ల కాజల్ సంతోషంగా ఉందని తెలుస్తోంది. అయితే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేటు.