English | Telugu
బిపాసాతో శ్రీ స్టెప్పులు..!
Updated : Apr 17, 2016
క్రికెటర్ నుంచి యాక్టర్‌గా మారిన భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ప్రస్తుతం మళయాళ చిత్రం టీమ్-5లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ బిపాసా బసు ఐటెం సాంగ్ చేయనుంది. దీనిలో బిపాసాతో పాటు శ్రీ కూడా చిందేయనున్నాడు. ముందు ఈ పాట కోసం సెక్సీబాంబ్ సన్నీలియోనీని అనుకున్నారు. అయితే సన్నీ కోటి డిమాండ్ చేసేసరికి చిత్ర యూనిట్ బిపాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని చిత్రబృందం తెలిపింది. శ్రీశాంత్‌కి డ్యాన్స్‌లో మంచి టాలెంట్ ఉంది. ఎన్నో షోల్లో, స్టేజిల మీద శ్రీశాంత్ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మరి అలాంటి శ్రీశాంత్ పక్కన డ్యాన్స్ చేయాలంటే చక్కగా డ్యాన్స్ చేయగలిగే నటిని ఎంచుకోవాలనుకుంది ఆ మూవీ యూనిట్. అసలే పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న బిపాసా ఇందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.