English | Telugu
ఆ రోజు జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Updated : Apr 20, 2016
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం సారథి స్టూడియోస్ లోని స్పెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్, మే 10 వరకూ జరుగుతుంది. ఆ తర్వాతి నుంచి, మరో షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు మూవీ టీం. టైటిల్ తో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై కూడా ఇప్పటికే అంతటా మంచి క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20 న జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తున్నారట. జూలై 3 వరకూ సినిమాకు సంబంధించిన ప్రధాన షూట్ ను ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని, ఆగష్ట్ 12 న సినిమాను రిలీజ్ చేయాలని కొరటాల, ఎన్టీఆర్ ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ పుట్టిన రోజు వరకూ, మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ఏదీ అఫీషియల్ గా రిలీజ్ కానట్టే. సినిమాలో మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తుండగా, సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లు గా సందడి చేయబోతున్నారు. మిల్కీ సైరన్ తమన్నా స్పెషల్ సాంగ్ లో చిందేయడం విశేషం.