English | Telugu
వందో సినిమాకు కొత్తగా ప్లాన్ చేసిన బాలయ్య..!
Updated : Apr 20, 2016
తన వందో సినిమా కోసం బాలయ్య కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే చరిత్ర పుస్తకాలను స్టడీ చేస్తూ, శాతకర్ణి పాత్ర కోసం తనను తాను మార్చుకుంటున్న బాలకృష్ణ, సినిమా ప్రారంభోత్సవం కూడా కొత్తగా ఉండాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకూ తన 99 సినిమాల్ని డైరెక్ట్ చేసిన దర్శకుల్లో వీలైనంత మందిని ముహూర్తపు షాట్ దగ్గర ఉండేలా బాలయ్య చూసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ నెల 22న జరగబోయే ప్రారంభోత్సవానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు బాలయ్య హార్డ్ కోర్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరవుతారని సమాచారం. కాగా మూవీకి సంబంధించి చాలా విభాగాల్లో కొత్తదనం ఉండాలని బాలయ్య ఆలోచిస్తున్నారట. రాజమాతగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి. కథానాయికగా, నయనతారను గానీ అనుష్కను గానీ తీసుకోవాలని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు. సొంత సంస్థలో నిర్మిస్తూ, దర్శకత్వం చేస్తున్న క్రిష్, ఈ సినిమా తెలుగువారి గొప్పదనాన్ని తెలుపుతుందంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ హిస్టారికల్ డ్రామాకు సంగీతం అందిస్తుండటం విశేషం.