English | Telugu
నాని మూవీలో జాన్వీ కపూర్.. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు.. కన్‌ఫ్యూజ్ చేస్తున్న నేచురల్ స్టార్!
Updated : Aug 26, 2024
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నాని నెక్స్‌ట్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గురువారం రిలీజ్ కానున్న ‘సరిపోదా శనివారం’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ నాని ఎంతో బిజీగా ఉన్నారు. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చింది మీడియా.
దీనిపై నాని స్పందిస్తూ ‘నా నెక్స్‌ట్ మూవీలో జాన్వీ కపూర్ నటించనుంది అనే వార్తలో నిజం లేదు. అది రూమర్ మాత్రమే. అయితే ఆమెను ఆ సినిమాలో తీసుకోవడం కోసం మేకర్స్ చర్చలు జరుపుతూ ఉండొచ్చు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సరిపోదా శనివారం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాను. అందుకే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు పూర్తిగా నాకు తెలీదు’ అని సమాధానమిచ్చారు. నాని మాటల్ని బట్టి ఆ వార్తలో నిజం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. జాన్వీ కపూర్ తన సినిమాలో నటిస్తోందనే వార్త అబద్ధం అని చెబుతూనే మరో పక్క దాని కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు అని కూడా చెప్పడంతో అందరిలోనూ కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నాని నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3, సుజిత్ డైరెక్షన్‌లో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఒకవేళ నాని సినిమాలో జాన్వీ నటిస్తోంది అనుకుంటే ఇందులో ఏ సినిమా అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.