English | Telugu

పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి 

కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్(pawan kalyan)మాట్లాడుతు ఒకప్పుడు అడవులని కాపాడే వాళ్ళని హీరో అనే వాళ్ళు. ఇప్పుడు అడవులని దోచుకునే వారిని హీరో అంటున్నామని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఎలక్షన్స్ టైం లో అల్లు అర్జున్ (allu arjun)నంద్యాల వెళ్లడం వల్లనే పవన్ ఆ వ్యాఖ్యలు చేసాడని అల్లు ఆర్మీ అనడం, రివర్స్ గా మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా కూడా బన్నీ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతు నాకు నచ్చితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నచ్చిన వారి కోసం వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల పై కూడా మెగా ఫ్యాన్స్ గట్టిగానే రిప్లై లు ఇస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(chandrasekhar reddy) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.

ఒక చానల్‌లో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతు అల్లు అర్జున్ కేవలం నటుడిగానే స్మగ్లింగ్ పనులు చేస్తున్నాడు. ఒక వేళ నిజ జీవితంలో స్మగ్లింగ్ వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి.ఈ విషయంపై పవన్ కి నేను చేసే విన్నపం ఒకటే. పవన్ పెద్ద మనసుతో నా మాటల వెనుక ఉద్దేశం అల్లు అర్జున్ గురించి కాదని చెప్పాలి. అలా చెప్తే వివాదానికి తెరపడుతుంది. ఒకవేళ పవన్ తన మాటలను వెనక్కి తీసుకోకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినట్టే.ఎందుకంటే భారత ప్రభుత్వమే అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాగే చాలా మంది ఫోన్లు చేసి పవన్ అలా అనడం ఏమిటని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పాడు.

ఇక నాగబాబు(naga babu) వ్యాఖ్యలపై కూడా మాట్లాడుతు ఆయన ఏదో ఫ్రస్టేషన్‌తో అని ఉంటారు. ఆంధ్రాలో ఓ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొన్నారు. అయితే వ్యతిరేక పార్టీలకు చెందిన వారిని కూడా మనవాళ్లే అనుకోవాలి. వారి కోసం కూడా పనిచేయాలి అని చంద్రశేఖర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. ప్రస్తుతానికి అయితే బన్నీ మామ వ్యాఖ్యలు ఒక రేంజ్ లోనే వైరల్ అవుతున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.