English | Telugu
తలైవాని చూసి... నువ్వు కావాలయ్యా అంటున్న తమన్నా!
Updated : Jul 4, 2023
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా జైలర్. తమన్నా నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫన్ ప్రోమో రిలీజ్ చేశారు నెల్సన్ అండ్ అనిరుద్. సినిమా సాంగ్ రిలీజ్ ఉందని అనిరుద్‌కి నెల్సన్ మెసేజ్ పెడతారు. నేరుగా వెళ్లి కలుస్తారు. అయితే, ముందు సాంగ్ ప్రోమో రిలీజ్ చేద్దామని సజెషన్ ఇస్తారు అనిరుద్. అలాంటివేం వద్దు, నేరుగా పాటే రిలీజ్ చేద్దామని కచ్చితంగా చెబుతారు నెల్సన్. ఇలా వారిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది. ఏ పాట అని అనిరుద్ అడిగితే, నీకు నచ్చిన తమన్నా పాట అని అంటారు నెల్సన్. నాకు నచ్చుతుందా? అని అనిరుద్ అడిగితే, మనకు నచ్చుందని అంటారు నెల్సన్. 70 శాతం తమిళ్, 30 శాతం తెలుగు పదాలు ఉండేలా ఈ సాంగ్‌ని రెడీ చేస్తున్నారు. ఇప్పుడే పాట రాస్తున్నట్టు కూడా ఈ వీడియోలో చూపించారు.
ఆద్యంతం ఫన్నీగా సాగిన ఈ వీడియో రజనీ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ గా ఉంది. వా... నువ్వు కావాలయ్యా అంటూ ఫీమేల్ వాయిస్‌లో ప్రోమో రిలీజ్ చేశారు. వినడానికి క్యాచీగా ఉంది సాంగ్. ఇప్పుడు జీ కర్దా, లస్ట్ స్టోరీస్‌తో జోరుమీదున్న తమన్నా ఇమేజ్‌ని క్యాష్ చేసుకునే ప్రయత్నం కనిపించింది వీడియోలో. రజనీ ఊసే లేకపోవడం మాత్రం కాస్త ఇబ్బందిగా అనిపించిందని అంటున్నారు ఫ్యాన్స్. రజనీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్న అదే రోజు ప్రభాస్ సలార్ టీజర్ విడుదల కానుంది. ఆ రోజు ఈ రెండు సినిమాల ట్రెండింగ్ తో ట్విట్టర్‌లో పోటీ మామూలుగా ఉండదని అంటున్నారు నెటిజన్లు.