English | Telugu

చెర్రీని ఎందుకు వదిలిపెట్టారో!

ఈ మధ్య ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు సినిమావాళ్ళ విషయంలో ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు. ఏదైనా భారీ సినిమా విడుదలవుతోందీ అంటే, ఆ సినిమా విడుదలకు ముందురోజు ఆ సినిమా దర్శక నిర్మాతలు, హీరో హీరోయిన్ల ఇళ్ళమీద దాడులు చేసి బోలెడంత డబ్బు, ఆస్తుల గుట్టు బయటకి లాగుతున్నారు. మొన్నామధ్య తమిళ సినిమా ‘పులి’ విడుదల సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన పెద్ద తలకాయలందరి ఇళ్ళమీద ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు దాడి చేసి బోలెడంత డబ్బు పట్టుకున్నారు. ప్రొడ్యూసరు, డైరెక్టరుతోపాటు హీరో హీరోయిన్లు విజయ్, సమంత, నయనతారల ఇళ్ళమీద కూడా దాడి చేసి వాళ్ళ ఖజానా గుట్టు బయటకి లాగారు.

ఆ విషయం అలా వుంటే, నిన్నగాక మొన్న బ్రూస్లీ సినిమా రిలీజ్ ముందు రోజు ఇన్‌కమ్ టాక్స్ అధికారులు తమ కత్తి బయటకి తీశారు. ఆ సినిమా నిర్మాత దానయ్య, డైరెక్టర్ శ్రీను వైట్ల, సంగీత దర్శకుడు తమన్ ఇళ్ళమీద దాడి చేశారు. ఈ దాడుల్లో బోలెడంత బ్లాక్ మనీ బయటపడిందని వార్తలు వస్తున్నాయి. అయితే అంతా బాగానే వుందిగానీ, సదరు ఇన్‌కమ్ టాక్స్ పెద్దమనుషులు హీరో రామ్‌చరణ్ ఇంటిని మాత్రం ఎందుకు వదిలేశారబ్బా అని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.

‘పులి’ సినిమా హీరో విజయ్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ‘బ్రూస్లీ’ సినిమా హీరో రామ్ చరణ్ ఇంటి మీద ఎందుకు దాడి చేయలేదబ్బా అని సణుక్కుంటున్నారు. రామ్ చరణ్ ఇంటి మీదకి ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు దాడి చేయకపోవడానికి కారణమేంటనేది బహిరంగ రహస్యమే. జాతీయ స్థాయి రాజకీయ నాయకుడు చిరంజీవి గారి పుత్రరత్రం కావడమే రామ్‌‌చరణ్ ఇంటి మీద దాడి జరగకపోవడానికి ప్రధాన కారణం. చిరంజీవి రాజకీయాల్లో చేరడం ఈ విధంగా కూడా లాభాన్ని ఇచ్చిందన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.