English | Telugu

లైఫ్ టైం లేట్ - షార్ట్ ఫిల్మ్

లైఫ్ టైం లేట్ అనే షార్ట్ ఫిల్మ్ నిర్మించిన యువ దర్శకుడు గుత్తికొండ నరేష్తాజాగా ఒక ప్రముఖ హీరోయిన్ని డైరెక్ట్ చేస్తూ తెలుగు సినిమా నిర్మిస్తునట్టు తెలియచేసారు. ఈ సినిమా పెరవల్ల రత్న కుమారి సమర్పణ లో రాజ్పాల్ రెడ్డి నిర్మాతగా గుత్తికొండ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుందని చెప్పారు. గతంలో ట్రాఫిక్ ప్రొబ్లెమ్స్ ను ప్రధాన సమస్యగా తీసుకొని లైఫ్ టైం లేట్ షార్ట్ ఫిల్మ్ చుసిన వారందరూ ప్రశంసించడం ఆనందనగా ఉందని , ఆ చిన్న చిత్రం ద్వారా వచ్చిన ప్రోత్సాహంతోనే పెద్ద సినిమా నిర్మిస్తునట్టు తెలియచేసారు. మన జీవితం పైన ట్రాఫిక్ అనేది యంతగా ప్రభావం చూపిస్తుందో , దానివలన జీవితం ఏవిధముగా మలుపు తిరిగుతుందో అన్న విషయాన్నీ 5 నిమిషాల నిడివిలోనే చూపించగలిగారు. అలాగే తీయబోయే సినిమా గురుంచి పూర్తి వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.