English | Telugu

గుజరాత్ లో సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఎంతవరకూ వచ్చింది.. నెక్ట్స్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు అనే ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది. ఈ వారం చివర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ గుజరాత్ వెళ్లబోతోందట. అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాతంలో ఈ షూటింగ్ జరగనుంది. ఓ ఫైట్ తో పాటు మూవీలో కీలకమైన తొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. నిజానికి ఈ సన్నివేశాలను జూన్ లోనే తీయాల్సి ఉంది. అయితే.. అప్పటికి యూనిట్ కి షూటింగ్ కోసం అవసరమైన పర్మిషన్స్ రాకపోవడంతో.. అఫ్పటి షెడ్యూల్ లో కొంత భాగం కేన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అన్నీ సక్రమంగా పూర్తి చేసుకుని గుజరాత్ బయల్దేరుతున్నారు మొత్తం యూనిట్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.