English | Telugu

నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్

నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తూంది. వివరాల్లోకి వెళితే గత డిసెంబర్ నెలలో ప్రారంభమైన యువ హీరో నితిన్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఇటీవల గోవాలో హీరో నితిన్ పైన ఒక పాటను చిత్రీకరించుకుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "ఇష్క్" అన్న పేరుని నిర్ణయించారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా ఎన్నికయ్యింది.

కేరళ నుంచి వచ్చిన నిత్య మీనన్ "అలా మొదలైంది" చిత్రంతో తెలుగు చలన చిత్ర రంగానికి హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి చిత్రంతోనే నిత్య మీనన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ ప్రముఖులను ఆకట్టుకుంది. కానీ నిత్య మీనన్ కాస్త పొట్టి అవటం వల్ల పెద్ద హీరోలెవరూ నిత్య మీనన్ కు తమ సినిమాల్లో అవకాశం ఇవ్వటానికి జంకుతున్నారు.

అందుకే నితిన్ హీరోగా నటించే "ఇష్క్" చిత్రంలో నిత్య మీనన్ కు అవకాశం తేలికగా దక్కింది. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా న్టిస్తున్న చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తూండగా, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నితిన్ 'ఇష్క్' లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం నిర్వహిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం