English | Telugu

త‌ల్ల‌యిన మ‌రుస‌టి రోజే చిన్మ‌యికి షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌

ఏ విష‌యంపైన అయినా మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పే, ప్ర‌ధానంగా పురుషుల నుంచి స్త్రీలు ఎదుర్కొనే వేధింపుల‌పై త‌ర‌చూ గ‌ళం విప్పే గాయ‌ని చిన్మ‌యి శ్రీ‌పాద ఇటీవ‌ల క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి త‌ల్ల‌యింది. ఆమె భ‌ర్త‌ న‌టుడు-ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ అనే విష‌యం తెలిసిందే. కాగా ఆమె త‌ల్ల‌యిన మ‌రుస‌టి రోజే సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. ఆమె ఒరిజిన‌ల్ అకౌంట్‌ను డిలిట్ చేసింది. దీనికి కార‌ణం.. ఆమె హేట‌ర్స్ ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌లో అస‌భ్య‌క‌ర‌మైన‌, అభ్యంత‌ర‌క‌ర‌మైన ఫొటోల‌ను పోస్ట్ చేయ‌డ‌మే.

త‌న ఇన్‌స్టా అకౌంట్‌ను ఆ సంస్థ డిలిట్ చేసిన విష‌యాన్ని చిన్మ‌యి స్వ‌యంగా తెలిపింది. త‌న బ్యాక‌ప్ హ్యాండిల్ ద్వారా ఆమె ఈ విష‌యాన్ని షేర్ చేసింది. "ఫైన‌ల్‌గా ఇన్‌స్టాగ్రామ్ నా ఒరిజిన‌ల్ అకౌంట్‌ను డిలిట్ చేసింది. వేధించేవాళ్ల‌వి కొన‌సాగిస్తూ, మాట్లాడేవాళ్ల‌వి మాత్రం తీసేస్తున్నారు." అని ఆమె రాసుకొచ్చింది. అలాగే, "నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్‌ చేశారు. ‘నా అకౌంట్‌లో న్యూడ్‌ ఫొటో పోస్ట్‌ చేసి.. పైగా నాపై రిపోర్ట్‌ చేశారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నా అకౌంట్‌ను రద్దు చేసింది. అయితే ఇంతకు ముందే తరచూ అబ్బాయిలు నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశాను. కానీ దీనిపై చాలామంది రిపోర్ట్‌ చేయడంతో తన అకౌంట్‌ను తిసేశారు. ఇది నా కొత్త అకౌంట్‌.. chinmayi.sripada " అని ఆమె ట్వీట్ చేసింది.

మీ టూ ఉద్య‌మంలో చిన్మ‌యి యాక్టివ్‌గా ఉన్న‌ప్ప‌ట్నుంచీ ఆమెను అనేక‌మంది ట్రోల్ చేస్తూ వ‌స్తున్నారు. కాగా భ‌ర్త రాహుల్‌తో క‌లిసి ఆమె అఖిల్ అక్కినేని సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'లో స్పెష‌ల్ రోల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది.