Read more!

English | Telugu

హీరో విజయ్ ' తేరీ ' కి తెలుగు టైటిల్ ఇదే..!

ఇప్పుడు తమిళ్ లో తేరీ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ విజయ్ ఫ్యాన్స్ తో పాటు, అందరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో చేరింది. తెలుగు ప్రేక్షకులకు కూడా విజయ్ బాగానే పరిచయం ఉన్నాడు. అందుకే దిల్ రాజు తేరీని తెలుగులోకి తెస్తున్నారు. తెలుగులో తేరీ టైటిల్ ను పోలీసోడుగా డిసైడ్ చేశారని సమాచారం. తెలుగులో ఇప్పుడు సరైనోడు టైటిల్ బాగా ప్రచారంలో ఉన్న కారణంగా, పోలీసోడు కూడా క్లిక్ అవుతుందనే ఆలోచనలో రాజు గారు ఉన్నారట. విజయ్, సమంత, ఆమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాను రాజారాణి ఫేం అట్లీ రూపొందించాడు. త్వరలోనే పోలీసోడు పోస్టర్లను రిలీజ్ చేయబోతున్నారు. అజిత్, సూర్య, విక్రమ్, కార్తి, విశాల్..ఇలా తెలుగులో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వాళ్ల లిస్ట్ పెద్దదే. తమిళంలో వీళ్ల రేంజ్ స్టార్ హీరోయే అయినా, విజయ్ ను మాత్రం తెలుగు ఆడియన్స్ కనికరించలేదు. మరి పోలీసోడితోనైనా, తెలుగులో విజయ్ కు మార్కెట్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.