English | Telugu
సల్మాన్ ఖాన్ మేనమామయ్యాడండోయ్..!
Updated : Mar 30, 2016
సల్లూ భాయ్ మేనమామయ్యాడు. 2014 నవంబర్లో తన ముద్దులు చెల్లెలి పెళ్లిని ఏ అన్నా చేయనంత గ్రాండ్ గా, ఆనందంగాచేశాడు సల్లూభాయ్.అర్పితా ఖాన్ కు రాజకుమారి రేంజ్ లో గ్రాండ్ గా ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి జరిగింది. బుధవారం ఉదయం, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అర్పిత. ఇన్నాళ్లూ పెళ్లిపెటాకులు లేకుండా సింగిల్ గా జీవితాన్ని గడిపేస్తున్న సల్లూభాయ్ జీవితాన్ని కలర్ ఫుల్ గా మార్చడానికి అతనిముద్దుల మేనల్లుడికి జన్మనిచ్చింది అర్పిత.
ఆమె భర్త ఆయుష్ తన ట్విట్టర్లో, ఈ విషయాన్నిప్రకటించారు. మా రాకుమారుడు ఆహిల్ వచ్చేశాడంటూ ఆయుష్ చేసిన ట్వీట్ సల్లూ అభిమానుల్లో కొండంత ఆనందాన్ని నింపింది. తమహీరోకు వారసుడు లేకపోయినా, మేనల్లుడు ఉన్నాడంటూ కండలు చరుస్తున్నారు సల్లూ ఫ్యాన్స్. ఇక పై మామయ్య అన్న పిలుపు, మాఇంట ముద్దులకు పెళ్లిపిలుపు అంటూ సల్లూ ఇంట పాటలు వినిపిస్తాయేమో..