English | Telugu

సినిమా చూడు...సగమే చూడు..!

'సార్. సినిమాకికథచెబుతాననివచ్చాడుఒకాయన. రైటరుట. సుమారుఅరవైఏళ్ళుంటాయి. పేరు గజేంద్రప్రసాద్. పంపమంటారా?'
అడిగాడుఅసిస్టెంటు.

అప్పుడే తలమీద మిగిలిన నాలుగున్నర వెంట్రుకలూ పీకేసుకోగా మిగిలిన గుండు తడుముకుంటూ, ముఖంచిరాగ్గాపెట్టి 'ముసలాడా?
కథచెబుతాడా? నీకేమైనా మతిపోయిందా?' అనిచాలా కోపంగా చూసి 'వెళ్ళు వెంటనే లోపలికి లాక్కురా ' అని ఎదురుగా వున్న కుర్చీ
తుడవటానికి లేచాడు, సదరు డైరెక్టరు సత్తిపండు. అసిస్టెంటు పరుగు లంకించుకుని ఆ ముసలి రైటరుని లాక్కొచ్చి, డైరెక్టరు ఎదురుగా
తుడిచిపెట్టిన కుర్చీలో కుదేసాడు.

'నాపేరు గజేంద్రప్రసాద్. నా దగ్గర సూపర్ హిట్టయ్యే సినిమాకి, ఓ మాంచి కథ వుంది ' అన్నాడు రైటరు, కుర్చీలో సద్దుకుని కూర్చుంటూ.

'సినిమాకి కథా? మరీ టూమచండీ. తెలుగుసినిమాలు హిట్టవ్వాలంటే కథ వుండకూడదు. సెంటిమెంటు ' అన్నాడు సత్తి.

'గాలి వుందా?' అడిగాడు రైటరు.

'వుంది ' అన్నాడు సత్తి.

'చూపించండి ' అన్నాడు రైటరు గజేంద్రప్రసాద్.

'కనిపించదుగా ' అన్నాడు అమాయకంగా సత్తి.

'సినిమాలో కథా అంతే. వుంటుంది. కానీ కనిపించదు ' అన్నాడు గజేంద్రప్రసాద్.

'ఓహ్! అలా వచ్చారా. అయితే ఓకే ' అని సగం అడ్వాన్స్ ఇచ్చిఅగ్రిమెంట్ చేసేశాడు సత్తిబాబు.

సినిమా మొదలయ్యింది. హీరోకీ, విలనుకీ డబ్బివ్వలేదు. 'సార్. ఓముప్పావలా ఇవ్వండి సార్. గడ్డాలు గీసుకుంటాం ఇద్దరం ' అని భోరున
ఏడుస్తూ అడిగారు. వాళ్ళు గడ్డాలు పెంచేసుకుని బూచాళ్ళలా, రోగిష్టాళ్ళలా అయ్యిపోయారు. అయినా సరే ఇవ్వలేదు సత్తి. తీరిక వేళల్లో,
ఒకరి గడ్డాల్లోంచి ఒకరు పేలు తీసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. పాతచెక్కల్తో సెట్ వేయించి సినిమా తీసిపారేస్తున్నాడు సత్తిపండు.

అలా సత్తి, ఓ రెండేళ్ళు తీసాడు సినిమాని. ఈలోగాహీరో, విలన్లకి తెగ పెరిగిపోయిన గడ్డాలు చూసి, పాకిస్తాన్ టెర్రరిస్టులని, అల్ ఖైదా
వాళ్ళో, అల్ మైదా వాళ్ళో హఠాత్తుగా వచ్చి పట్టుకుపోయారు. సత్తి దగర కూడా డబ్బులయ్యిపోయాయి. ఇక రైటరు సగం డబ్బే
ఇచ్చినందుకు, మిగతా సగం కథ చెప్పనుపో, దిక్కున్న చోట చెప్పుకో అని వేరే హిందీ నిర్మాతకి, కిడ్నాపయ్యిన హీరో విలన్ల కథని మార్చి
చెప్పేయటానికి, చొక్కా వేసుకోనీ ఓహిందీనటుడి దగ్గరకి చక్కాపోయాడు.

సత్తి, ఏమయితే అయ్యిందని, సగం వుడికిన కూర ఆరోగ్యానికి మంచిదని వెంటనే గుర్తు తెచ్చేసుకుని, తాను తీసిన సగం సినిమాని జనాల
మీదకి వదిలేసాడు. అందులో అర్ధాంతరంగా ఆగిపోయిన చివరిసీనులో ' ఇంకావుంది ' అని పెట్టేసి శుభంకార్డేసేసాడు. ఆ సినిమా చూసిన
జనం, సినిమా అయ్యిందా? అవ్వలేదా అనే మీమాంసలో కొట్టుకు చచ్చి, అర్ధం కాక జుట్టు పీకేసుకుని, బయటకి వెళ్ళే ఓపిక లేక, తలని
అక్కడే థియేటర్లో వున్న గోడకి కొట్టేసుకుని, భోరున ఏడుస్తూ బయటకెళ్ళిపోయారు. పూర్తి డబ్బులు తీసుకుని, సగం సినిమా చూపిస్తారా
అని గొడవచేసారు. ఇలా అర్ధం కాలేదనిటాక్ వచ్చాకా, అన్ని భాషల్లోనూ కూడా విడుదలచేసారు. అలా దేశం మొత్తంలో వున్న వెర్రిజనం,
సినిమా చూసి, మరీ వెర్రాళ్ళయ్యి, దిక్కులు చూస్తూంటే, అవార్డు కమిటీ వాళ్ళు ఆ దిక్కుకెళ్ళి, ఆ సినిమా చూసి, చూసీ చూడనట్టు
అవార్డిచ్చేసారు.

ఇప్పుడు మధ్యలో ఆగిపోయిన సినిమాల తాలూకు నిర్మాతలు, 'వార్నీ. సినిమాకి అవార్డ్ రావటానికి సినిమా పూర్తిగాతీయక్కర్లేదా ' అని
వాళ్ళ వాళ్ళ సినిమాలు భుజానేసుకుని అవార్డ్ కమిటీ ఆఫీసు ముందు క్యూకట్టారు. కొత్త నిర్మాతలు కూడా తలలు బద్దలు కొట్టుకోకుండా,
వాయిదా పద్ధతుల్లో సినిమాలు తీయటం మొదలెట్టారు.

---- గిరీశం

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.