English | Telugu
ఇన్ క్రెడిబుల్ డెసిషన్ పై అమీర్ ఏమన్నాడంటే ..
Updated : Jan 8, 2016
ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పై అమీర్ ఖాన్ స్పందించాడు. ఇండియా ఎప్పటికి ఇన్‌క్రెడిబుల్ అని అమీర్ పేర్కొన్నాడు. దేశం కోసం సేవలందిండచం గర్వంగా ఉందని, దేశం కోసం పని చేయడానికి ఎనీ టైమ్ రెడీగా వుంటానని అన్నాడు. అలాగే దేశం కోసం పదేళ్లు రూ.3 కోట్ల రూపాయలు వదులుకొని.. ఉచితంగానే సేవలందించానని గుర్తు చేశాడు. నా సేవల్ని నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. దేశ ప్రయోజనాల కోసం వారు తగిన చర్యలు తీసుకొంటారని భావిస్తున్నాను అని అమీర్ అన్నాడు. అసహనంపై అమీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన సేవలను వాడుకోవద్దనే ఉద్దేశంతోనే కేంద్ర౦ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.