English | Telugu
నందమూరి చిన్నోడు మహాముదురు..!!
Updated : Jan 8, 2016
నందమూరి చిన్నోడిని మహాముదురు అని ఎందుకు అంటారో? ఈ విషయం తెలుసుకుంటే మీకే అర్ధమవుతుంది. ఒక పక్క బాబాయి మీద పోటీగా సినిమా దింపడానికి తన యూనిట్ ని మొత్తం రేయింబవళ్ళు కష్టపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన సినిమాని ప్రొమోట్ చేసుకోవడం కోసం మరిన్ని ఎత్తులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ మీడియాకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అలాగే తన సినిమా రిలీజ్ రోజే బుల్లితెర సూపర్ హిట్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో సందడి చేయబోతున్నాడట. కానీ ఇందులో ఆసక్తికర విషయం ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే వుంది అసలు ట్విస్ట్..!!
నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో 12.5 లక్షలు గెలుచుకున్న ఎన్టీఆర్..అందరూ వూహించని ట్విస్ట్ ఇచ్చాడట. ఈ డబ్బుల్లో సగం తన బాబాయి నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ట్రస్టుకు.. మిగిలిన సగం డబ్బులు మామ ఎన్టీఆర్ ట్రస్టుకు డొనేట్ చేశాడట. ఈ దెబ్బతో బాబాయి అభిమానులకు, టిడిపి అభిమానులకు వల విసిరాడనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ వద్ద బాబాయికి ఫిట్టింగ్ పెట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం తాను లాభపడడానికి..బాబాయ్.. మామయ్య లతో ఎలాంటి విభేదాలు లేవని అభిమానులకు సిగ్నల్స్ పంపిస్తున్నాడు. అదీ సంగతి. ఇప్పుడు ఈ చిన్నోడి గురించి మీరేమంటారు?