English | Telugu

రూ. 97 కోట్ల ప్రాప‌ర్టీ కొన్న హృతిక్‌!

ముంబైలోని సంప‌న్నులు అధికంగా నివాసం ఉండే జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఉన్న ఓ కొత్త ఆస్తిని బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ హృతిక్ రోష‌న్ కొనుగోలు చేశాడ‌నీ, దాని విలువ రూ. 97.50 కోట్లనీ ఆదివారం ఓ న్యూస్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఈ న్యూస్‌ను హృతిక్ తండ్రి రాకేశ్ రోష‌న్ ధ్రువీక‌రించారు. అయితే ఇప్పుడే ఆ ఇంట్లోకి వెళ్లే ఆలోచ‌న హృతిక్‌కు లేద‌ని స‌మాచారం.

"త‌ల్లిదండ్రుల‌కు, కుటుంబానికి హృతిక్ బాగా ఎటాచ్డ్‌గా ఉంటాడు. అందుక‌ని ఇప్పుడు కొత్త చోటుకు వెళ్లే ఆలోచ‌న అత‌ను చేయ‌డు. అత‌ను కొన్న రెండు అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ కూడా భ‌విష్య‌త్తులో త‌న ఇద్ద‌రు కొడుకులకు ఇవ్వ‌డం కోసం" అని అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక‌రు చెప్పారు. ఒక‌వేళ త‌ల్లిదండ్రులు క‌నుక త‌న‌తో పాటు వ‌చ్చేట్ల‌యితే కొత్త‌చోటుకు వెళ్లవ‌చ్చని ఆయ‌న తెలిపారు.