English | Telugu

కార్తికేయతో సమంత... మాటలయ్యాయి!

యువ కథానాయకుడు, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయతో అగ్ర కథానాయిక సమంత నటిస్తుందా? అంటే... 'నటించవచ్చు' అని సమాధానం చెప్పాలి. 'వైల్డ్ డాగ్' చిత్రీకరణ నిమిత్తం కింగ్ అక్కినేని నాగార్జున మనాలి వెళ్లడంతో... ఆదివారం బిగ్ బాస్ ఎపిసోడ్ హోస్ట్ గా ఆయన కోడలు సమంత వచ్చారు. ఇదే షోలో కార్తికేయ కూడా సందడి చేశారు. ఆయన ఓ పాటకు డాన్స్ చేశారు. ఆ తరువాత కార్తికేయ, సమంత మధ్య సినిమాకు సంబంధించిన చర్చ జరిగింది.

షో నుండి 'మహర్షి' ఫేమ్ దేవి ఆదివారం ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో కార్తికేయ స్టేజి మీద ఉన్నాడు. "దేవికి నీ సినిమాలో ఛాన్స్ ఇవ్వాలి" అని కార్తికేయను సమంత రిక్వెస్ట్ చేశారు. "మహేష్ గారి సినిమాలో ఆ అమ్మాయి నటించింది" అని గుర్తు చేస్తూనే... తన సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తానని మాటిచ్చాడు. పనిలో పనిగా తనతో ఓ సినిమాలో నటించాల్సిందిగా సమంతను రిక్వెస్ట్ చేశాడు. వెంటనే సమంత ఓకే చెప్పేశారు. మనం ముగ్గురం కలిసి ఓ సినిమాలో నటిద్దామని మాటిచ్చేశారు. మాటలు అయితే పూర్తయ్యాయి... దర్శక నిర్మాతలు ఎవరైనా మంచి కథతో వెళ్తే సినిమా కూడా పట్టాలు ఎక్కుతుందని ఆశించవచ్చు. ‌

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.