English | Telugu

రామ్‌తో త్రివిక్రమ్ సినిమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరూ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పని చేయడానికి రెడీగా ఉంటారు. అతడితో సినిమా చేయడానికి ఆల్రెడీ ఎన్టీఆర్, మహేష్ బాబు కమిట్ అయ్యారు. ఈ టైమ్‌లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. రీసెంట్‌గా రామ్‌ని కలిసి కథ కూడా చెప్పారట. దీనికి కారణం ఎన్టీఆర్, మహేష్ త్వరగా తన సినిమా ప్రారంభించడానికి రెడీగా లేకపోవడమే కారణమని తెలుస్తోంది.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చేస్తున్నారు. అది పూర్తయ్యి త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అలాగే, పరశురామ్ దర్శకత్వంలో మహేష్ 'సర్కారు వారి పాట' చిత్రీకరణ జనవరిలో ప్రారంభించనున్నారు. వాళ్లిద్దరూ బిజీగా ఉండటంతో మధ్యలో రామ్‌తో సినిమా చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్ గా తెలుస్తోంది. ఆల్రెడీ కథ విన్న రామ్, వెంటనే చేస్తానని చెప్పారట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. త్వరలో సినిమాకి సంబంధించిన ప్రకటన రానుందని సమాచారం.