English | Telugu

తెలుగు హీరోయిన్‌‌కి కోలీవుడ్‌ కష్టాలు


కష్టజీవి శ్రీదివ్యకు కొత్త కష్టం వచ్చింది. బాలనటిగా ప్రిన్స్ మహేష్ సినిమాలో నటించిన తెలుగమ్మాయి శ్రీదివ్యకు కోలీవుడ్ లో ప్రస్తుతం చాలా అవకాశాలున్నాయి. తెలుగులో మల్లెలతీరం, బస్‌స్టాప్ చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్కిన శ్రీదివ్వ తమిళ పరిశ్రమలో మంచి ఛాన్స్ లు వచ్చాయి. పెన్సిల్, ఈటి, తాణా ఇలా వరుసగా ఒకే ఏడాదిలో 7 సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో టాప్ హీరోల పక్కన కూడా శ్రీదివ్యకు అవకాశాలు వస్తున్నాయి. పరిశ్రమకు వచ్చిన తక్కువ సమయంలోనే విశాల్, విక్రమ్, ప్రభూ, జీవా వంటి హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది.


ఇలా 7 సినిమాలతో బిజీగా వున్న శ్రీదివ్యపై అక్కడి మీడియాలో కొత్త కథనాలు మొదలయ్యాయి. శ్రీదివ్య రెమ్యూనరేషన్ పెంచింది, దర్శకులను, నిర్మాతలను సతాయిస్తోంది, యూనిట్‌కి చుక్కలు చూపిస్తోంది అంటూ టాకు మొదలైందట. కోలీవుడ్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం చూసి శ్రీదివ్య షాకుకు గురైందట. ఆపై, "అవన్నీ నా మీద వస్తున్న పుకార్లే, ప్లీజ్ వాటిని నమ్మకండి" అంటూ ప్రకటన ఇచ్చిందట. సిన్సియర్ గా పనిచేసుకుంటున్న తనపై ఇలాంటి రూమర్లు రావటం ఎంతో ఆశ్చర్యంగా వుందంటోంది శ్రీదివ్య.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.