English | Telugu
బుల్లితెరపై అమల, నాగార్జున
Updated : Jul 15, 2014
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోతో బుల్లితెర ప్రేక్షకలను ఆకట్టుకుంటున్న నాగార్జున బాటలో ఆయన సతీమణి అమల కూడా నడవబోతున్నారు. అమల అక్కినేని బుల్లితెర మీద నటనకు స్వాగతం పలుకుతున్నట్లు తెలుస్తోంది. 90 దశకాల్లో హీరోయిన్‌గా దక్షిణాది భాషల్లో నటించిన అమల చాలా కాలంపాటు స్క్రీన్‌కి దూరంగా వున్నారు. ఈ మధ్యే తనకు నచ్చిన పాత్రలు వున్న ఒకటి, రెండు సినిమాల్లో ఆవిడ నటించారు. సినిమాలు అయినా సీరీయల్స్ అయినా ఏదైనా ప్రత్యేకత వున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు అమల. ఈ కోవలో వచ్చిన చక్కటి స్క్రిప్ట్ కావటంతో ఆమె ఒక తమిళ సీరియల్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆగస్టులో ప్రసారం కానున్న ఈ సీరియల్ లో ఆమె డాక్టర్‌గా నటిస్తున్నారు. గతంలో హీరోయిన్లుగా కొనసాగిన రమ్యకృష్ణ, ఇంద్రజ, మీనా, రాధిక ఇలా బుల్లితెరపై సీరియల్స్ నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు ఆ కోవలో అమల అక్కినేని కూడా చేరుతున్నారు. ఏమైనా, బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ నిన్నటి తరం హీరోయిన్లను అభిమానులకు మరలా దగ్గర చేస్తున్నాయి.