English | Telugu
నటి తారాచౌదరిని చంపేస్తాడట..
Updated : Jul 15, 2014
నన్ను చంపేస్తాడట, కాపాడండంటూ పోలీసులను ఆశ్రయించింది తారా చౌదరి. తారాచౌదరి... ఈ పేరు గుర్తుండే వుంటుంది. సెక్స్ రాకెట్ విషయంలో సంచలన విషయాలు మీడియా ముందు బయట పెట్టిన తారా చౌదరి ఆ తర్వాత కూడా అనేక వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచారు.
తాజాగా ఆమె తన ప్రాణాలు కాపాడమంటూ పోలీసులను ఆశ్రయించింది. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి తాగేసి ఆమె ఇంటికి వచ్చి నానా యాగి చేసి, చివరకు ప్రాణాలు తీస్తానంటూ బెదిరించడంతో, హడలిపోయిన తారా పోలీసు స్టేషన్ కు పరుగులు తీయవలసి వచ్చింది. దుర్గాప్రసాద్ నుంచి కాపాడమంటూ వచ్చిన తారా చౌదరిని పోలీసులు ఆదుకున్నారు. ఆమె ప్రాణాలు తీస్తానంటు బెదిరించిన అతడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఆమె ప్రాణాలు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా అతను ఆమె స్నేహితుడే అని తేలింది. విజయవాడకు చెందిన అతను తారా చౌదరికి చాలా కాలంగా పరిచయస్తుడే అని తెలుస్తోంది.
ఇదలా వుంచితే గతంలో కూడా అనేక సార్లు వేధింపులు, బెదిరింపులు వస్తున్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో రాజకీయ నాయకులు మొదలుకొని వాచ్‌మ్యాన్ వరకూ వున్నారు. పదే పదే బెదిరించే పరిణామాలు తారా చౌదరి విషయంలోనే ఎందుకు చోటుచేసుకుంటున్నాయనే అనుమానం ఆమె ఇచ్చిన ఫిర్యాదల గురించి తెలిసిన ప్రతివారికీ కలుగుతోంది. గత నెలలో తన పట్ల వాచ్మెన్ సుబ్రహ్మణ్యం అసభ్యంగా ప్రవర్తించి, దాడికి యత్నించాడని తారా చౌదరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.