English | Telugu

ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని ఇంకా చూడని తండ్రి

సినీ నటుడు ఉదయ్ కిరణ్ మరణవార్త తెలిసి కూడా ఇటు కుటుంబీకులు గానీ, అటు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు గానీ ఉదయ్ మృతదేహాన్ని సందర్శించానికి ఇప్పటివరకు రాలేదు. మృతదేహానికి ఉస్మానియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు ఉదయ్ భౌతిక కాయాన్నినిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అయితే తన కొడుకు భౌతిక కాయాన్ని ఇప్పటివరకు కూడా ఉదయ్ తండ్రి చూడలేదు. మస్కట్ నుంచి ఉదయ్ సోదరి శ్రీదేవి వచ్చేవరకు మార్చురీలోనే మృత దేహాన్ని ఉంచుతారని తెలిసింది. ఉదయ్ చెల్లెలు శ్రీదేవితో తాను కూడా తన కొడుకు ఉదయ్ భౌతికకాయాన్ని చూస్తానంటూ తండ్రి వివికె మూర్తి స్పష్టం చేశారు.