English | Telugu
హీరో రామ్ సినిమా మొదలెట్టాడు..!
Updated : Apr 9, 2016
వరస ఫ్లాపుల్లో అల్లాడుతున్న రామ్ కు, నేనే శైలజ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇన్నాళ్లుగా ఫ్లాపుల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ యంగ్ హీరోకు ఇప్పుడు కాస్త గాలి ఆడుతోంది. అందుకే సినిమా రిలీజై నెలలు దాటేస్తున్నా, కొత్త సినిమాను అనౌన్స్ చేయకుండా రిలాక్స్ అయ్యాడు. ఇప్పుడు బాగా ప్లాన్ చేసుకుని, తనకు కందిరీగ సినిమానిచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో ఇంకో సినిమాకు రెడీ అయ్యాడు. ఉగారి రోజున ఈ కొత్త సినిమా ముహూర్తం అయ్యింది. మహేష్ నిర్మాతలుగా పేరొందిన 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ రామ్ పాత్రలన్నీ ఎనర్జీతో ఫాస్ట్ గా సాగిపోయేవి. అవి రొటీన్ అయిపోవడంతో, నేను శైలజలో కాస్త భిన్నంగా ట్రై చేశాడు. సినిమా కూడా ఆకట్టుకోవడంతో హిట్టు కొట్టి గట్టెక్కేశాడు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ కథ చెప్పి ఒప్పించాడంటే, అది ఏ కథ అయ్యుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ తన తరహాలో పూర్తి ఎనర్జీతో మళ్లీ మాస్ ఎంటర్టైనర్ రూట్ లోకి వెళ్తాడా..? లేక కొత్త ప్రయోగం చేసి ఇంకో హిట్టు కోసం ప్రయత్నిస్తాడో చూడాలి..