English | Telugu
ఫిలింనగర్‌లో శ్రీమంతుడి దోసె..ధర రూ.670
Updated : Apr 9, 2016
గ్రామాల దత్తత కాన్సెప్ట్‌తో వచ్చి అందరికి ఇన్స్‌పిరేషన్‌గా నిలిచిన మూవీ శ్రీమంతుడు. మహేశ్ బాబు కెరిర్‌లోనే గాక తెలుగు సినిమా చరిత్రలోనూ మైల్‌స్టోన్‌గా నిలిచిన మూవీ. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. శ్రీమంతుడులో వాడిన కాస్ట్యూమ్స్, సైకిల్ వేటికవే ప్రత్యేకమైనవి. వీటి కోసం అభిమానులు ఎగబడ్డారు. ఇప్పుడు ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మరో సంస్థ సిద్థమైంది.
హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నెం.1లో నూతనంగా ఏర్పాటైన కారంపొడి రెస్టారెంట్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి శ్రీమంతుడు దోసెని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ధర 670 రూపాయలుగా నిర్ణయించారు నిర్వహకులు శ్యామ్ జంపాల. శ్రీమంతుడు దోసెతో పాటు బొమ్మిడాల పులుసు, రాగి సంగటి, నాటు కోడి పులుసు, భాగమతి మసాలా పప్పు, జొన్నరొట్టె, నెయ్యి అన్నం మెనులో స్పెషల్ ఎట్రాక్షన్. సో వీలు కుదిరినప్పుడు మీరు కూడా వెళ్లి లాగించండి.