English | Telugu
విజయ్ పోలీసోడు ఈవారమే వస్తున్నాడు..!
Updated : Apr 10, 2016
ఇళయదళపతి విజయ్ కొత్త మూవీ తేరీ తెలుగులో పోలీసోడుగా రాబోతున్న విషయం తెలిసిందే. తమిళంలో ఇప్పటికే సూపర్ క్రేజ్ తో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను తెలుగులో రిలీజ్ చేసే బాధ్యత దిల్ రాజు తీసుకున్నారు. తెలుగులో సూపర్ హిట్టయిన రాజారాణిని తెరకెక్కించిన అట్లీ దర్శకుడు. సర్దార్ రిలీజ్ కు ముందు ఆ ప్రభంజనంలో పోలీసోడిని పోస్ట్ పోన్ చేద్దామా అని రాజు సందేహించారు. కానీ సర్దార్ కు మిక్స్ డ్ టాక్ రావడంతో, పోలీసోడిని ఈ వారం రిలీజ్ చేసేయడానికే ఫిక్స్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ, త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నానని, ఇప్పటికే రాజారాణిని కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, పోలీసోడిని కూడా ఆదరిస్తారనుకుంటున్నా అన్నారు. నెలరోజుల క్రితం చెన్నై వెళ్లినప్పుడు తేరీ పాటలు, ప్రోమోలు చూసి, మంచి సినిమా అవుతుందని అనుకున్నానని, ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందన్నారు దిల్ రాజు. పోలీస్ గెటప్ లో పవన్ నిరాశ పరిచిన నేపథ్యంలో, ఇప్పుడు పోలీసోడు ఏం చేస్తాడో చూడాలి.