Read more!

English | Telugu

హీరో నాని ఎవడితడు...?

ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఫుల్ టాలెంట్ తో, భవిష్యత్తుపై బెంగ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఏకైక హీరో నాని. అతని సినిమా అంటే చాలు, మినిమం గ్యారెంటీ అనే భరోసా నిర్మాతల్లోనూ, మినిమం ఎంటర్ టైన్మెంట్ అనే భరోసా ప్రేక్షకుల్లోనూ కనిపిస్తుంది. పైసా, జెండా పై కపిరాజు, ఆహా కళ్యాణం. ఈ మూడూ తప్పితే నాని సినిమాల్లో అన్నీ కథాపరంగా బలమైనవే. ఇవిచ్చిన ఫ్లాప్ నుంచి తేరుకుని భలే భలే మగాడివోయ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, నాని సినిమా టైటిల్స్ అన్నీ చాలా విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. పిల్లజమీందార్, ఎవడే సుబ్రహ్మణ్యం, అష్టా చమ్మా, భీమిలి కబడ్డీ జట్టు, భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమగాథ..ఇలా అన్నీ వైవిధ్యంతో పాటు తెలుగుతనం ఉట్టిపడేవే కనిపిస్తుంటాయి. లేటెస్ట్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో నటిస్తున్న నాని, తన తర్వాతి సినిమా టైటిల్ ను కూడా చాలా వెరైటీగా, తెలుగులో ఉండేలా చూసుకున్నాడు. మొదట ధమాకా అన్న టైటిల్ అనుకున్నా, అదంత సెట్ కాలేదని ' ఎవడితడు ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట నాని అండ్ కో. ఇంద్రగంటి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన నివేదితా థామస్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా, సైలెంట్ గా జరుపుకుంటోంది. త్వరలోనే మూవీ యూనిట్ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారని సమాచారం.