English | Telugu

సెప్టెంబర్ 23 న పవన్ కళ్యాణ్ అభిమానుల ఫెస్టివల్

పవన్ కళ్యాణ్(pawan kalyan)రాజకీయాల్లో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా కూడా సినిమాలు చెయ్యడం మాత్రం ఆపకూడదనేది అభిమానుల కోరిక. అందుకే పవన్ లిస్ట్ లో ఉన్న హరిహరవీరమల్లు(hari hara veera mallu)ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ మూడు మూవీలు కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి.ఆ పై మొన్న జరిగిన ఎలక్షన్స్ కి సంబంధించిన బిజీ తో పాటు డిప్యూటీ సిఎం, మంత్రిగా పవన్ బిజీగా ఉండటంతో షూట్ కి వెళ్లలేకపోయాయి.

కానీ ఇప్పుడు సెప్టెంబర్ 23 నుంచి పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.ఈ మేరకు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. దీంతో ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి షూటింగ్ లో పాల్గొనబోతున్న సినిమాగా వీరమల్లు నిలిచిందని చెప్పవచ్చు. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే ఉస్తాద్, ఓజి(og)వీరమల్లు నిర్మాతలు పవన్ ని కలిసి తమ సినిమాల గురించి చర్చించారు. త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటానని పవన్ ఆ ముగ్గురికి హామీ ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే అందరు ఓజి కి ప్రిఫెరెన్స్ ఇస్తాడని భావించారు. కానీ ఇప్పుడు పవన్ అనూహ్యంగా వీరమల్లు లో పాల్గొనబోతున్నాడు. మిగతా రెండు సినిమాల డేట్స్ విషయంలో కూడా త్వరలో ఏమైనా వార్తలు వస్తాయేమో చూడాలి.

ఇక వీరమల్లు పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతుంది. పైగా పవన్ చేస్తున్న తొలి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కూడా వీరమల్లు నే. నిజానికి ఉస్తాద్, ఓజి ల కంటే ముందే వీరమల్లు ప్రారంభం అయ్యింది. ఇంకా చెప్పాలంటే 2023 లో రిలీజైన బ్రో కంటే ముందే షూటింగ్ ని స్టార్ట్ చేసింది. పవన్ తోనే ఖుషి వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన ఏఎం రత్నం నిర్మాత కాగా ఆయన తనయుడు జ్యోతి కృష్ణ నే దర్శకుడు.క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ వచ్చిన విషయం తెలిసిందే.ఆల్రెడీ వీరమల్లు టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.