English | Telugu
కీలక సన్నివేశాల్లో చరణ్ గోవిందుడు
Updated : May 8, 2014
"ఎవడు" వంటి బ్లాక్ బస్తర్ హిట్ చిత్రం తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గోవిందుడు అందరి వాడెలే". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం నానాక్రం గూడా దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కుటుంబకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.