English | Telugu
‘గుడ్ లక్ గణేషా’ మూవీ రివ్యూ
Updated : Jan 20, 2024
మూవీ : గుడ్ లక్ గణేషా
నటీనటులు: యోగి బాబు, రమేష్ తిలక్, ఊర్వశి, కరుణాకర్, ఉదయ్ చంద్ర, హరీష్ పేరడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఎస్ నయ్యర్
ఎడిటింగ్ : సయాలో సత్యన్
మ్యూజిక్: భరత్ శంకర్
నిర్మాత : లిజో జేమ్స్
దర్శకత్వం: రెజిష్ మిథిలా
ఓటీటీ: ఆహా
తమిళ కమేడీయన్ యోగిబాబు కామెడీ టైమింగ్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. యోగిబాబు, రమేష్ తిలక్ ప్రధాన పాత్రల్లో నటించిన " గుడ్ లక్ గణేషా" మూవీ తాజాగా ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం...
కథ:
చెన్నైలోని ఓ వీధిలో ఇంటి మేడమీద గణేష్ అనే ఒకతను రెంట్ కి ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ పేరు మల్లిక. తనకి గత నాలుగు సంవత్సరాల నుండి రెంటు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుంటాడు. ఇక అతనికి జాబ్ లేకపోయేసరికి మల్లిక తన సొంత ఆటోని గణేష్ కి ఇచ్చి నడపమంటుంది. ఆ ఆటో నడుపగా వచ్చిన డవ్బులని కూడా మల్లికకి ఇవ్వకుండా తాగుతుంటాడు. అయితే గణేష్ కి వినాయకుడు అంటే ఇష్టం. ప్రతీరోజు వినాయకుడికి తన భాదలు చెప్పుకుంటూ ఉంటాడు గణేష్. ఓ రోజు వినాయకుడికి గణేష్ మొక్కుతుండగా.. వినాయకుడు మాయమవుతాడు. ఆ తర్వాత గణేష్ కి ఎక్కడ చూసిన, ఏ గుడిలో, ఏ ఫోటోలో చూసిన వినాయకుడు కన్పించడు. దాంతో అతనిలో టెన్షన్ మొదలవుతుంది. ఇక ఒకరోజు వినాయకుడు గణేష్ కళ్ళముందుకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గణేష్ అప్పులు తీరాయా లేదా అనేది మిగతా కథ...
విశ్లేషణ:
ప్రపంచంలో ప్రతీ మనిషికి ఎన్నో కష్టాలుంటాయి. వాటన్నింటినీ తట్టుకోలేక ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ బాధలను దేవుడితో షేర్ చేసుకుంటారు. వారందరికి ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒకవేళ ఆ దేవుడే స్వయంగా వస్తే ఎవరూ నమ్మరు. అదే ఈ సినిమా కథగా తీసుకోని రెజిష్ మిథిలా అద్భుతంగా మలిచారు. చాలా చిన్న కథ.. దానిని అంతే సింపుల్ గా తీసారు మేకర్స్. అన్ని కష్టాలని తీర్చమని గణేష్ అనే అతడు దేవుడిని వేడుకోవడం, ఆ దేవుడే స్వయంగా రావడం అంతా ఓ మిరాకిల్ లాగా అనిపిస్తుంది. అయితే కాన్సెప్ట్ బాగున్నప్పటికి స్లో సీన్లు చాలానే ఉంటాయి.
చిన్న సినిమాని ఓ గంటలో చూపిస్తే బాగుండనిపిస్తుంది. దేవుడికి మనిషికి మధ్య జరిగే వాటిని ఇప్పటికే మనం.. గోపాల గోపాల, నయనతార నటించిన అమ్మోరు సినిమాలలో చూసాం. అదే కాన్సెప్ట్ ని కాస్త కొత్తగా చూపిస్తూ తీసిన ఈ సినిమా ఓసారి చూడొచ్చనేలా తీసారు. అడల్ట్ సీన్స్ ఏం లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసారు మేకర్స్.
నిజంగా మంచి చేస్తే ఆ దేవుడు నీలోనే ఉంటాడనేది చూపిస్తూ కాస్త డిఫరెంట్ గా ట్రై చేశారు. కానీ హీరో యొక్క అప్పులు, వాటి గురించి అతను పడే ఇక్కట్లు , జులాయిగా తిరిగే వ్యక్తికి దేవుడు సాయం చేయటం కొన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చకపోవచ్చు. ఓ ముసాలాయనకి హెల్ప్ చేయడానికి హీరో రాజస్థాన్ వెళ్ళడం, అక్కడ అతని గతం తెలుసుకోవడం.. ఇలా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఈ సీన్స్ అన్నీ స్కిప్ చేస్తూ చూసేవిగా ఉంటాయి. స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది. భరత్ శంకర్ అందించిన మ్యూజిక్ బాగుంది. కార్తిక్ ఎస్ నయ్యర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ లో కత్తెరకి పని చెప్తే బాగుండేది. కొన్ని స్లో సీన్లని కట్ చేస్తే బాగుండేది. కాస్త నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
గణేశ్ పాత్రలో చేసిన రమేష్ తిలక్ ఒదిగిపోయాడు. దేవుడిగా మనిషిగా యోగిబాబు ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
దేవుడికి మనిషికి ఉన్న తేడాని వివరిస్తూ తీసిన ఈ సినిమా వీకెండ్ లో ఓసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్