English | Telugu

గోలీసోడా ఫేమ్ విజయ్‌ మిల్టన్‌ తాజా చిత్రం 'గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌' టైటిల్‌ టీజర్‌ విడుదల

'గోలీసోడా', 'గోలీసోడా-2' చిత్రాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో గోలీసోడా ఫ్రాంఛైజీ లో భాగంగా గోలీసోడాలోని స్పిరిట్‌ను.. ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్వి భాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడు. ఈ చిత్రంతో ఆయన తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌'గా టైటిల్‌ని ఫిక్స్‌ చేసి, వినాయక చవితి పర్వదినాన ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ప్రముఖ తమిళ కథానాయకులు విజయ్‌ సేతుపతి, విజయ్‌ ఆంటోని, ఆర్యలతో పాటు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ తమ ఎక్స్‌ అకౌంట్‌ వేదికగా టైటిల్‌ను ట్వీట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు.

దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ '' గోలీసోడాలోని రఫ్‌నెస్‌ను, న్యూ చాప్టర్‌లో ఈ సినిమాలో ఆడియన్స్‌ చూడబోతున్నారు. ఈ టైటిల్‌ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీజర్‌తో మా సినిమాపై ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. తప్పకుండా మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో అందరి అంచనాలను అందుకుంటుంది. ఈ సందర్బంగా మా టైటిల్‌ టీజర్‌ను తమ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మమ్ములను సపోర్ట్‌ చేసిన అందరికి ధన్యవాదాలు"అన్నారు.

రాజతరుణ్‌, సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా విజయ్‌ మిల్టన్‌, ఎడిటర్‌ గా పాపన్‌ జేఆర్‌ వ్యవహరిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...