English | Telugu
రాజా సాబ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్!
Updated : Aug 28, 2025
పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్ చేస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయని కూడా చెప్పవచ్చు. 'మారుతీ'(Maruthi)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై 'టిజి విశ్వప్రసాద్'(Tg Vishwa Prasad)ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.
రాజాసాబ్ డిసెంబర్ 5 న రిలీజ్ కాబోతుందని అధికార ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో డిసెంబర్ 5 కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ రీసెంట్ గా తేజ సజ్జ, మంచు మనోజ్ ల 'మిరాయ్'(Mirai)మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. మిరాయ్ కి విశ్వప్రసాద్ నే నిర్మాత. రాజా సాబ్ గురించి మాట్లాడుతు ఇటీవల సినీ కార్మికులు సమ్మె చెయ్యడం వలన, కొంత భాగం షూటింగ్ పెండింగ్ లో ఉంది. త్వరలోనే బ్యాలన్స్ షూటింగ్ ని పూర్తి చేసుకొని 'రాజాసాబ్' ని సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేస్తున్నామని ప్రకటించాడు. దీంతో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ప్రభాస్ సంక్రాంతి బరిలో దిగుతున్నట్టయ్యింది. 2004 జనవరి 14 న వర్షం , 2007 జనవరి 10 న యోగి, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
గత కొన్ని రోజులుగా రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి వాయిదా పడుతుందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'రాజాసాబ్ ని డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి సీజన్ కి మార్చవద్దు. నార్త్ లో సంక్రాంతి ప్రభావం తక్కువ. కాబట్టి డిసెంబర్ 5 నే వస్తే నార్త్ లో కలిసొచ్చి, పుష్ప 2 లాగా పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు సృషించవచ్చని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక రాజా సాబ్ కి మారుతీ దర్శకుడు కాగా, నిధి అగర్వాల్(Nidhhi Agerwal),మాళవిక మోహనన్(Malavika Mohanan),రిద్ది కుమార్(Riddhi kumar)హీరోయిన్లు. సంజయ్ దత్, సునీల్ శెట్టి, బొమన్ ఇరానీ ,వెన్నెల కిషోర్, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్(Thaman)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.