English | Telugu

‘గేమ్‌ ఛేంజర్‌’ కొత్త అప్‌డేట్‌పై అందరూ షాక్‌.. అది నిజమేనా?

ఇటీవల విడుదలైన కమల్‌హాసన్‌, శంకర్‌ల సినిమా ‘భారతీయుడు2’ అందర్నీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టీ రామ్‌చరణ్‌తో శంకర్‌ చేస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’పైనే ఉంది. ముఖ్యంగా అభిమానులు ఈ సినిమా ఎలా ఉండబోతోందోననే ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన అప్‌డేట్స్‌ చూస్తుంటే ఒక యునీక్‌ సబ్జెక్ట్‌తోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రాబోతోందనే సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

ఈ సినిమాకి సంబంధించి ఓ కొత్త అప్‌డేట్‌ ప్రచారంలో ఉంది. దాన్ని చూసి ప్రేక్షకులు, అభిమానులు షాక్‌ అవుతున్నారు. అదేమిటంటే.. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తాడన్న విషయం అందరికీ తెలుసు. నిజాయితీ కలిగిన రాజకీయ నేత అప్పన్నగా, అతని కొడుకు రామ్‌నందన్‌గా చరణ్‌ నటిస్తున్నారు. నందన్‌ కాలేజ్‌ డేస్‌లోని సీన్స్‌లో, కియారాతో రొమాన్స్‌ చేసే సీన్స్‌లో లుక్‌ ఒకలా ఉంటుంది. ఆ తర్వాత ఐఎఎస్‌గా మారిన చరణ్‌ లుక్‌ మరోలా ఉంటుంది. దీంతో చరణ్‌ మూడు క్యారెక్టర్స్‌ చేస్తున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చేసింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని అర్థమవుతోంది. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలవుతుండగా, నవంబర్‌లో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నట్టు తెలుస్తోంది.