English | Telugu

'భగవంత్ కేసరి'లో ఐదు ఫైట్లు.. జైలు ఫైట్, ఫారెస్ట్ ఫైట్ కి పూనకాలే!

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలలో అదిరిపోయే ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగ్ లను ప్రేక్షకులు ఆశిస్తారు. ఆయన తాజా చిత్రం 'భగవంత్ కేసరి' వైవిధ్యమైన కథతో ఎమోషనల్ గా సాగే ఫిల్మ్ అయినప్పటికీ.. ఇందులో కూడా బాలయ్య మార్క్ ఫైట్లు, డైలాగ్ లు ఉంటాయట. ఈ సినిమాలో మొత్తం ఐదు ఫైట్లు ఉన్నాయని అంటున్నారు. ఫైట్లన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని, ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్ డ్రామా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక టీజర్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని ఫైట్స్ సంబంధించిన అప్డేట్ మాస్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.

'భగవంత్ కేసరి'లో ఫస్టాఫ్ లో రెండు ఫైట్లు, సెకండాఫ్ లో మూడు ఫైట్లు ఉన్నాయట. ఈ ఐదు ఫైట్లు కూడా అదిరిపోయాయని అంటున్నారు. జైలు ఫైట్ తో బాలయ్య ఇంట్రడక్షన్ ఉంటుందట. ఈ ఇంట్రో ఫైట్ కి థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయమట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ అయితే సినిమాకే హైలైట్ గా నిలవనుందట. బాలయ్య ఉగ్ర రూపానికి థమన్ బ్యాక్ స్కోర్ తోడై ఆ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో వచ్చిందని చెబుతున్నారు. సెకండాఫ్ లో వచ్చే ఫారెస్ట్ ఫైట్ కూడా జైలు ఫైట్ కి ఏ మాత్రం తగ్గకుండా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇక క్లైమాక్స్ ఫైట్ లో కూడా బాలయ్య విశ్వరూపం చూపిస్తాడట. మొత్తానికి ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలకు కుటుంబ ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అవుతారో.. యాక్షన్ సన్నివేశాలు కూడా మాస్ ని అదే స్థాయిలో మెప్పిస్తాయని అంటున్నారు.