English | Telugu

దిల్‌రాజు య‌వ్వారం బ‌య‌ట‌ప‌డింది

`14మందితో సిండికేట్` ...ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తున్న ప‌దం ఇది. ప‌ద్నాలుమంది నిర్మాత‌లు ఓ గ్రూపుగా ఏర్ప‌డి, మీడియాకి ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా, వాళ్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది. త‌మ‌న‌కు అనుకూల‌మైన ఛాన‌ళ్ల‌కే ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ మొత్తం గ్యాంగ్‌కి.. దిల్‌రాజు లీడ‌ర్‌. సురేష్ బాబులాంటి హేమా హేమీలు ఈ గ్యాంగ్‌లో ముఖ్య వ్య‌క్తులు. సినిమా చిన్న‌దైనా, పెద్ద‌దైనా కొన్ని ఛాన‌ళ్లు, న్యూస్ పేప‌ర్ల‌కే యాడ్లు ఇవ్వాలన్న‌ది వీళ్ల నిర్ణ‌యం. ఈ గ్యాంగ్‌లో చేరితే... సిండికేట్ నియ‌మావ‌ళిని అనుస‌రించాల్సిందే. అయితే ఆ నియ‌మాల‌ను ప‌క్క‌కు తోశాడు దిల్‌రాజు. ఎందుకంటే త‌న సినిమా `కేరింత‌`కు ఎక్క‌డ దెబ్బ‌ప‌డిపోతోందో అన్న‌భ‌యంతో.

ఇటీవ‌ల దోచేయ్‌, పండ‌గ చేస్తోలాంటి సినిమాలువ విడుద‌ల‌య్యాయి. వీటి విష‌యంలో దిల్‌రాజు చాలా నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించాడు. ఏబీఎన్‌ ఆంధ్ర‌జ్యోతితో స‌హా పెద్ద ఛాన‌ళ్లుకు యాడ్లు ఇవ్వ‌కుండా చేశాడు. దాంతో ఆంధ్ర‌జ్యోతి ఈ రెండు సినిమాల్నీ ఏకిప‌డేసింది. పండ‌గ చేస్కో సినిమాకి దండ‌గ చేస్కో అంటూ రివ్యూ రాసి నిప్పులు చెరిగింది. దాంతో దిల్‌రాజు కంగారు ప‌డ్డాడు. త‌న సినిమా `కేరింత‌`కు ఆంధ్ర‌జ్యోతికి పిలిచి మ‌రీ యాడ్లు ఇచ్చాడు. దాంతో దిల్‌రాజు య‌వ్వారం బ‌య‌ట‌ప‌డింది.

`నీకో న్యాయం మాకో న్యాయ‌మా` అంటూ సిండికేట్లో ఉన్న సాటి నిర్మాత‌లు దిల్‌రాజుపై నిప్పులు చెరుగుతున్న‌ట్టు భోగ‌ట్టా. కేరింత సినిమాని కాపాడుకోవ‌డానికే దిల్‌రాజు యాడ్లు ఇచ్చాడ‌న్న‌ది సుస్ప‌ష్టం. అంటే త‌న సినిమాకి మాత్రం నెగిటీవ్ టాక్ రాకూడ‌దు, బ‌య‌టి సినిమాలు ఎలా పోయినా ఫ‌ర్లేదా? ఇదే విష‌యం దిల్‌రాజుని అడిగితే `నేను సిండికేట్‌లోనే ఉన్నా.. కొన్ని నిబంధ‌ల మేర‌కు యాడ్లు ఇవ్వాల్సి వ‌చ్చింది` అంటూ క‌వ‌రింగు చేసుకొంటున్నాడ‌ట‌. మ‌రి ఈ మాట‌ల్ని నిర్మాత‌లు నమ్ముతారా? ఈ సిండికేట్ వ్య‌వ‌స్థ ఉంటుందా? ఊడుతుందా?? అనేది భ‌విష్య‌త్తే తేల్చాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.