English | Telugu

ద‌ర్శ‌కుడితో స‌హ‌జీవ‌నం చేస్తున్న స్టార్ క‌థానాయిక‌?

లివింగ్ టుగెద‌ర్ రిలేష‌న్ షిప్ టాలీవుడ్‌కీ పాకింది. ఓ స్టార్ ద‌ర్శ‌కుడితో ఓ స్టార్ క‌థానాయిక స‌హ‌జీవ‌నం చేస్తుంద‌న్న‌ది లేటెస్ట్ టాలీవుడ్ గాసిప్‌. ఆ ద‌ర్శ‌కుడికి ఇండ్ర‌స్ట్రీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన స్టామినా ఉంది. ఆ హీరోయిన్‌కి టాప్ హీరోల‌తో చిందులు వేసిన ఘ‌న‌త ఉంది. వీరిద్ద‌రూ క‌ల‌సి గ‌తంలో ఓ సినిమా చేశారు. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరిగి ద‌గ్గరయ్యార‌ట‌.

హైద‌రాబాద్‌లోని ఓ స్టార్ హోట‌ల్‌లో ఇద్ద‌రూ మ‌కాం పెట్టేశార‌ని తెలుస్తోంది. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ద‌ర్శ‌కుడికి ఆల్రెడీ పెళ్ల‌యి పిల్ల‌లూ ఉన్నారు. ఈ హీరోయినేమో ఓసారి ల‌వ్‌లో ప‌డి ఫెయిల్ అయ్యింది. వీరిద్ద‌రి ఎఫైర్ గురించి టాలీవుడ్ అంతా తెలిసిపోయింది. త్వ‌ర‌లో ఆ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే సినిమాలో ఈమెనే క‌థానాయిక అని తెలుస్తోంది. ఎఫైర్లు న‌డ‌ప‌డం ఆ ద‌ర్శ‌కుడికేం కొత్త‌కాదు. ఆల్రెడీ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేశాడ‌ట‌. ఈ ఎఫైర్ ముచ్చ‌ట‌గా మూడోది. మ‌రి ఆ ద‌ర్శ‌కుడెవ‌రు, ఆ స్టార్ నాయిక ఎవ‌ర‌నే విష‌యాల‌పై ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఆస‌క్తి నెల‌కొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.